ఆన్ లైన్ పాఠాలు!...--..అచ్యుతుని రాజ్యశ్రీ

 కరోనా వల్ల  ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. సీత కు కాస్త  కంటిచూపు సమస్య. చెవులు కూడా  సరిగ్గా  వినపడవు.క్లాసు లో ఐతే ముందు బెంచీలో కూచుని పాఠాలు వింటుంది.బోర్డు దగ్గర గా ఉంటుంది కాబట్టి  చూసి రాసుకుంటూ  అచ్చుపుస్తకం చదివి ఆకళింపు చేసుకుని పరీక్షల్లో మంచి మార్కులు పొందుతుంది. కళ్ళజోడు ఉన్నా అది కింద పడకుండా  ఎవరి చేతికి తగిలి పగలకుండా  చాలా జాగ్రత్త గా ఉంటుంది. సాయంత్రం ఇంటికి రాగానే  అమ్మ  హోంవర్క్ చేయించి  ఆడుకోడానికి  పంపుతుంది.  కానీ  కరోనా వల్ల  ఆన్లైన్ క్లాసులతో సీత కు పాఠాలు బుర్రకెక్కటంలేదు.జూమ్ లో టీచర్ కనపడ్డా మనసు ఎటో పారిపోతూఉంటుంది. నెటా సరిగ్గా ఉండదు. సీత తల్లి  మంచి తెలివిగలది.అందుకే  ఓఉపాయం ఆలోచించింది."సీతా!టీచర్  చెప్పబోయే పాఠం నీకు చదివి వివరిస్తాను. ఆపై నీవు  నాకు చెప్పాలి నీసొంత మాటల్లో.ఆన్లైన్ పాఠం బాగా  అర్థం అవుతుంది. పాఠాన్ని  పెద్దగా నోటి తో  స్పెల్లింగ్ తోసహా చదువుతూ దాని అర్థం గ్రహించాలి.అక్షరాలు గుర్తు పట్టి సరియైన ఉచ్చారణ తో చదివితే  జవాబు  నోటికి వచ్చేస్తుంది. ప్రతిఅక్షరం తెలుగు  హిందీ భాషవి చదివి అంటే  స్పెల్లింగ్ తప్పులురావు.అంటూ రాయాలి. అది ముఖ్యం."
అంతే సీత అమ్మ మాట వింటు  అంటూ పదాలు రాస్తోంది.  లెక్కలు కూడా  ఒకటికి  రెండు సార్లు  చదివి  అర్థం  చేసుకుని  చేస్తోంది.  ఇప్పుడు  ఆన్లైన్ క్లాసులో టకటకా జవాబులు  చెప్పగలుగుతోంది. కొత్త పాఠం ముందుగా చదివితే ఆ ఆనందం థ్రిల్  భలే ఉంటుంది. మరి కరోనా మహమ్మారి  ప్ర పంచాన్ని పూర్తిగా  వదిలేదాకా మనకు తిప్పలు తప్పవు.  ఆరోగ్యం ముఖ్యం కదా!సర్వేజనా:సుఖినో భవంతు.