వచ్చేనే వాన: - నమిలకొండ జయంత్ శర్మ
వచ్చేనే వచ్చేనే వాన
వరదై పొంగేనె వాన
నెచ్చలై వెచ్చనై వాన
మెచ్చేల వచ్చేనే వాన.

చేల చేలలోన వాన
నిచ్చెన వోలెనె  వాన
పచ్చడాల కప్పినటుల
పరుగున రాలేనె వాన

వాగుల్ల వంకల్లోవాన
పాలనురుగుల తీగలవాన
మెరుపుల వెలుగుల
దూకుతూ సాగెనే వాన.

వంకలు వంకలై చెరువల వాన
చేనుకొండల కోనలలోనా వాన
సవ్య సాచుని బాణాలవోలె
సాగిపోయెనే వేల చినుకులవాన.

ఉరుములమెరుపులవాన
ఊర్లన్ని చూట్టేనె మబ్బూలవాన
సింగిడీల నెలవంకై వాన
నేలరాతిగుండెలమ్రోగేనవాన

వెదుర వనాల సుయ్యనేవీచేవాన
సరాగాల రాగాల మురిపించేవాన
బెకబెక కప్పల కీచురాలలోవాన
టపటపమనుచు సవ్వడిజేసేవాన

హొరెత్తిపోయె కాల్వలలోనవాన
వాడలల్లవంకలుదిరుగుచువాన
తరగల నురగల్ల బుడగల్లవాన
మెరుపులసాగే మేలు భళివాన


కామెంట్‌లు