విదూషకుడు...రచన..అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ఆనందంగా  ఆరోగ్యంగా ఉండాలంటే  హాయిగా నవ్వు తూ  నవ్విస్తూ ఉంటే చాలు. నలుగురు మనకి పరిచయం  అవుతారు. మనకి తెలీని ఎన్నో విషయాలు తెలుస్తాయి. నవ్వు కోసం లాఫింగ్ క్లబ్ లున్నా యి.ఇంటిలో అందరం కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతే ఆప్యాయత ప్రేమ పెరుగుతాయి. బడిలో సరదాగా  కబుర్లు  నవ్వులతో పిల్లలు చిలోపొలో అంటారు. మరి లాక్డౌన్ వల్ల  ఇంటి లో  బోర్!పిల్లలు  పెద్దలు  కూడా  నీరసంగా  నిరుత్సాహంతో  కనపడుతున్నారు. పూర్వం నాటకాలలో విదూషకుడు  అనేపాత్ర  జనాలను నవ్వించేది.శ్రీకృష్ణుని దగ్గర వసంతకుడు  నారదుడు  పాత్ర లు తమ వాచికం అభినయంతో నవ్వించేవారు.ముఖ్యంగా కృష్ణతులాభారంలో చిలకమర్తి వారి గణపతి నాటకం రేడియో లో వింటే ఆమజా తెలుస్తుంది. తెనాలిరామకృష్ణుడు బీర్బల్  కథలు అలరిస్తాయి.సర్కస్ లో బఫూన్ మాజిక్ కూడా ఆనందం ఇస్తాయి. ఇకతొలిఇంగ్లీష్ క్లౌన్ హాస్యగాడు జోసెఫ్ గ్రిమాల్డి1779..1837.స్టేజిపై అతని అభినయంతో  జనం పడీపడీ నవ్వేవారు.ఒకసారి  అతను డాక్టర్ దగ్గరికి వెళ్లి "నాకు  వంట్లో బాగా లేదు "అంటే  మందు ఇచ్చి  మళ్ళీ  వారం తర్వాత రమ్మన్నాడు. "నాపరిస్థితిలో మార్పులేదు " అనగానే  డాక్టర్ "చూడు..జోక్స్ వేస్తూ అందరితో మాట్లాడు. నీకు రోగం లేదు. రోజూ గ్రిమాల్డి షో కి  వెళ్ళు"అన్నాడు. "నాకు కుదరదు.""ఏం?నాఫీజు కన్నా టికెట్టు  చౌక" "నిజమే కానీ  నేనే ఆ గ్రిమాల్డి! జనాలను నవ్వించటం అంతసులభం కాదు "అనగానే  డాక్టర్ నోట మాట రాలేదు మరి.కానీ  మనం హాయిగా  నవ్వుతు ఉంటే నలుగురూ మనవారు అవుతారు సుమా!