విమర్శ..:--.అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒకరిని గూర్చి పూర్తిగా  తెలుసు కున్నాకే  వారితో బాగా  పరిచయం ఏర్పడినాకే మన అభిప్రాయం పంచుకోవడం మంచిది. అనవసరంగా  వారి తో  వాదం చేసి కొరివితో తలగోక్కోరాదు.మన భావం వారు  తప్పుగా అర్ధం చేసి కుని  ఇంకో రకంగా కలిపించి ప్రచారం చేస్తారు. మన దగ్గర సమాచారం గుంజి మనకే కుచ్చుటోపీ పెట్టే కాలం.!అలాంటి వారికి జవాబు ఇవ్వాలి. లేదా వారి నోరు  వారి  ఇష్టం అని వారి స్నేహం  మానెయ్యాలి. 
ఒక గర్విష్ఠి  రోజూ  గుడికి  వచ్చేవాడు.  గుడిమంటపంలో ఒక వృద్ధుడు మౌనంగా  శివా భిషేకం చూస్తూ తన చేతిలోని జపమాల తిప్పేవాడు.ఆయన్ని  చూస్తూ గర్విష్ఠి  అందరూ చూసేలా  పూజారి పళ్లెంలో  పదిరూపాయల నోటు ఉంచి కాసేపు  కబుర్లు చెప్పి వెళ్ళేవాడు. ఆలయపెద్దలు  ఆతని పటాటోపం చూసి పెదవి కదిపేవారు కాదు. కానీ  మౌనంగా ఉన్న ఆపెద్దాయనపెదవి కదపడు.తనని చూసి కూడా  నవ్వడు అనే దుగ్ధ ఆవ్యాపారికి ఉంది.  అందుకే  ఆరోజు  ఆయప పక్కనే కూర్చుని "తాత!మీరు ఈ జపం ఇంట్లో  చేసుకోవచ్చు గదా?ఇక్కడ అందరికీ చూపాలి మీ భక్తి  అని వస్తారా?"
ఆతాతగారు ప్రశాంతంగా ఇలా అన్నారు "బాబూ! గుడి ఆవరణలో  పాజిటివ్ ఎనర్జీ ఆవరించి ఉంటుంది. మంత్రపఠనం హారతి దీపంవెలుగులు వాతావరణంని శుద్ధి చేస్తాయి.ఇక్కడి రావి వేప మారేడు జమ్మి చెట్లగాలి శారీరక మానసిక ఆరోగ్యం కలిగిస్తాయి.నేను విదేశాల్లో ప్రొఫెసర్ గా ఉండి రిటైర్ కాగానే  నాఊరిపై మమకారంతో  వచ్చాను. మీరు  దానం ధర్మం  మీ ఇంటి  దగ్గరే చేయవచ్చు. మీవ్యాపారలావాదేవీలు నాకు తెలీదు. మీవిషయం లో తలదూర్చనునేను. అలాగే గుడి విశిష్టత తెలీకుండా  మీఆడంబర దర్పం చూపవద్దు."అంతే ఆవ్యక్తి  తల వంచుకుని గబగబా గేటు దాటి కారులో కూలబడ్డాడు.