గజల్:-సముద్రాల శ్రీదేవి
నీతోనే మాటలన్ని గ్రంథంగా మారిపోయె
నీసొగసుల వాసనంత గంధంగా మారిపోయె

నీమాటల సడిలోనే నేనేమో వణికిపోయి
నా చూపే నీదరిలో బంధంగా మారిపోయె

కానలేని వేళలోన కనిపించిన అందగత్తె
నా చూపులు నీ వైపుగ మందంగా మారిపోయె

హీనమైన వింతరూపు నాదంటును నీవనకే
నీచెంతను చేరినపుడు అందంగా మారిపోయె

నామాటలు నీనోటను  వెల్లువగా వెల్లడైన
నీరూపే  అందమైన చందంగా మారిపోయె

దిక్కులన్నితిరుగుచుండిదిక్కులేనినేనుఇపుడు
నాచూపులు నీవు ఉన్న కేంద్రంగా మారిపోయె

గుండెలోననిండిపోయిఉప్పొంగినరూపమౌచు
ప్రేమయనెడి నీరమున్న సంద్రంగా మారిపోయె

నీచూపులతాకిడితోమరిచిపోనిమరుపురాని
ప్రేమలోన నా బ్రతుకే హుందంగా మారిపోయె

శ్రీదేవీ ప్రేమించిన నాలోనే ఎగిసిపడిన
ఊహలన్ని శాశ్వతంగ నందంగా మారిపోయె