నాన్న కోసం (చిన్న కథ)రచన తాటి కోల పద్మావతి . గుంటూరు.

 

రంగనాథ్ కొడుకు సురేష్ ని టెన్త్ క్లాస్ పూర్తి కాగానే పట్నంలో కాలేజీలో ఇంటర్ చదివించడానికి చేర్పించాడు.
పుస్తకాలు ఫీజులు బట్టలు కుట్టించడానికి బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాడు రంగనాథ్ ఉన్న రెండు ఎకరాల పొలం సాగు చేసుకుంటూ ఆ ఆదాయంతోనే ఇల్లు గడుపుతూ కొడుకుని చదివిస్తున్నాడు.
సురేషు తన ఫ్రెండ్స్ అందరికీ బైకులు ఉన్నాయని తనకి బైక్ కావాలని అడిగాడు.
అంత డబ్బు ఎక్కడ ఉంది .
ఈ సంవత్సరం అసలే పంటలు పండలేదు అప్పు చేయక తప్పలేదు అన్నాడు.
అదేం లేదు నాకు బండి కొనాల్సిందే అంటూ పట్టుబట్టాడు అసలే రంగనాథం భార్యకి ఆరోగ్యం బాగాలేదు పట్నం లో చేర్పించి ఆపరేషన్ చేయించాలి అన్నారు ఆపరేషన్ అంటే మాటలా లక్షలు కావాలి మళ్లీ అప్పు చేయాల్సిందే వచ్చే సంవత్సరం కూడా పంటలు పండు లేదు నమ్మకం లేదు.
రంగనాథం భార్య మంచం లో ఉంది చూసావా మన వాడికి బండి కొనాలి ట అంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకురాను ముందు మీ ఆరోగ్యం ముఖ్యం అన్నాడు రంగనాథం.
నా ఆరోగ్యం మెరుగు పడేది కాదు ఎలాగూ త్వరలో దాన్ని నా కోసం అంత డబ్బు ఖర్చు చేయటం దండగ ఆ డబ్బుతో మన అబ్బాయికి బండి కొని పెట్టండి వాడి .
  ముచ్చట తీరుతుంది అన్నది.
బండి ఇవాళ కాకపోతే రేపైనా కొనచ్చు ముందు మీ ఆరోగ్యం ముఖ్యం ఎలాగూ వాడి చదువు పూర్తికాగానే అమెరికా పంపించాలని నాకు ఉన్నది.
అమెరికా అంటే మాటల అంత డబ్బు మనకి ఎక్కడిది అండి వాడికి లేనిపోని అసలు కల్పించండి అన్నది బాధగా. కొడుకు కంటే పొలం ముఖ్యం కాదు ఉన్న రెండెకరాలు అమ్మేసి అప్పులు తీర్చి మిగతాది సురేష్ ని అమెరికా పంపడానికి ఉపయోగపడుతుంది అన్నాడు రంగనాథం అప్పుడే అటుగా వచ్చిన సురేషు తల్లిదండ్రుల మాటలు విన్నాడు నేను ఇన్నాళ్లు నా తల్లిదండ్రుల్ని అపార్థం చేసుకున్నాను నాకు బండి కొన్న మని బాధపెట్టాను అమ్మకి ఆరోగ్యం బాగాలేదని నాకేం తెలుసు ఆపరేషన్ చేయాలని తెలియదు నాన్న అంత డబ్బు ఎక్కడనుంచి తెస్తాడు నాకు బైక్ కోసం దాచిన డబ్బు అమ్మకి ఆపరేషన్ కి ఖర్చు చేయమని చెప్తాను అమ్మ అ ఆరోగ్యం కంటే నాకు బైక్ ముఖ్యం కాదు.
నన్ను అమెరికా పంపించడానికి నాన్న పొలం అమ్ముతాం అంటున్నాడు పొలం కాస్త అమ్మితే అమ్మానాన్న ఎలా బ్రతుకుతారు అనుకుంటూ తన మనస్సు ఉ మార్చుకున్నాడు.
నాన్న అన్న నేను నేను మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి ముందు అమ్మకి ఆపరేషన్ చేయించండి నేను చదువు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించుకుని బండి కొనుక్కుంటాను మీరు నా కోసం పొలం అమ్మ వలసిన పని లేదు నేను నేను అమెరికా వెళ్లాను ఇక్కడే ఉండి మీకు వ్యవసాయంలో సాయం చేస్తాను అంటూ తన మనసులోని మాటను చెప్పాడు.
కొడుకు మాటలు వినగానే రంగనాథం కి సంతోషం వేసింది.
నీకు పెద్ద చదువులు చదవాలని అమెరికా వెళ్లాలని ఉంటుంది కదా నీ స్నేహితుల ముందు నువ్వు తక్కువ కాకూడదు మేము ఎలాగైనా బ్రతకగలం నువ్వు మా కన్నా నా పై అంతస్తులో ఉంటే చూడాలని ఉంది అన్నాడు రంగనాథం.
సురేష్ మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు నాన్న కోసం తను అమెరికా వెడితే ఇక్కడ అ వీళ్ళ సంగతి ఇ ఎవరు చూస్తారు అనాధలుగా వదిలి వెళ్ళలేను అక్కడ సంపాదించి లక్షలు కోట్లు పంపించిన తల్లిదండ్రులకు సుఖం ఉంటుందా.
కన్న కొడుకు గా దగ్గరుండి వాళ్ల బాధ్యతల్ని చూసుకోవాలి వాళ్లు నా కోసం ఇంత కష్టపడుతుంటే నేను వాళ్ల రుణం తీసుకోకుండా ఎలా ఉండగలను.
కొడుకు మాటలు కొడుకు మాటలతో కొండంత ధైర్యం వచ్చింది రంగనాథ కి భార్యకి ఆపరేషన్ చేయించాడు రెండేళ్లలో డబ్బు అప్పులు తీర్చాడు సురేష్ డిగ్రీ పూర్తి చేసుకొని ఏదైనా ఉద్యోగం చేసుకోమని చెప్పిన వినలేదు.
నాన్న మాట నాకు వేదం. అనుకున్నాడు వ్యవసాయ రంగంలో కొత్త కొత్త మార్పులు చేసి ఇ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ రెండు ఎకరాల పొలాన్ని సాగు చేసి 10 ఎకరాలు చేసి ఇ తండ్రికి కానుకగా ఇచ్చాడు నాన్న కోసం తను కష్టపడే సంపాదించిన పొలం అమెరికా వెళితే అంతటి ఆనందాన్ని ఇవ్వగలరా ఎక్కడో దూరంగా ఉండి పంచే ప్రేమ తల్లిదండ్రులకు సంతృప్తి గా ఉండదు దగ్గర ఉండి తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూసుకోవడంలో ఉన్న ఆనందం మరి ఎక్కడ ఉంటుంది.
అందుకే సురేష్ నాన్న కోసం వ్యవసాయాన్ని నమ్ముకున్న మట్టిని నమ్ముకున్న తల్లిదండ్రుల్ని రుణం తీర్చుకోవాలి అనుకున్నాడు.
కథ పేరు నాన్న కోసం.