*ఓనాడు!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.ఓనాడు మన బతుకు!
   అతిసరళం! సాదాసీదా!
   వాదాలా! ప్రతివాదాలా!
  వేదం చదివేవాళ్ళం!
2.భూమిని నమ్మాం!
   పశువులు పోషించాం!
పిల్లలు ఎక్కువే అయినా,
    పద్ధతిగా పెంచాం!
గ్రామాల్లో నివాసం!
సాలిగ్రామ సహవాసం!
3.మనిషిగా పుట్టినోళ్ళం!
  మంచిగా బతికినోళ్ళం!
  మంచి పెంచినోళ్ళం!
   మంచి పంచినోళ్ళం!
4.వంచన తెలియదు!
   ఆత్మవంచన లేదు!
  పరనింద రాదు!
   పరోపకారం పోదు!
5.మాయ లేదు!
   భయం లేదు!
   రోగం లేదు!
   రాగమే ఉంది!