కవితల పోటీలో జగదీష్ కు బహుమతి


 జిన్నారం: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వాగ్దేవీ కళా పీఠం, విజయవాడ కవన వేదిక సంయుక్తంగా  శుక్రవారం నాడు"హనుమజ్జయంతి" అనే అంశంపై అంతర్జాలంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితల పోటీలో బొల్లారం మునిసిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి, ప్రముఖ బాలకవి దాసరి జగదీష్ ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రోత్సాహక బహుమతి పొందినట్లు పాఠశాల తెలుగు భాషోపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు జగదీష్ ని అభినందిస్తూ నిర్వాహకులు ప్రశంసా పత్రం అందజేశారు. కవితల పోటీలో ప్రతిభ కనబరిచి ప్రోత్సాహక బహుమతి పొందిన జగదీష్ ని ప్రధానోపాధ్యాయుడు మంగీలాల్, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.