మనిషి రోడ్డున పడ్డాడు.:- తాటి కోల పద్మావతి గుంటూరు.

 కామేశం పొద్దున్నే పేపర్ పట్టుకొని బజారున పడతాడు.
శంకర్ విలాస్ సెంటర్లో నిలబడి వచ్చే జనం పోయే జనాన్ని చూస్తూ నిలబడ్డాడు.
ఎవరి కోసమో వెతుకుతున్నట్లు అటూ ఇటూ చూస్తాడు.
అప్పటికే జనం హోటల్ ముందు చేరుకుంటారు.
శంకర్ విలాస్ హోటల్ లో ఇడ్లీ సాంబార్ అంటే అందరికీ చాలా ఇష్టం అందుకే అక్కడ ఎప్పుడు రద్దీగా ఉంటుంది.
కామేశం అటు ఇటు చూస్తున్నాడు.
అతని పక్కనుంచి ఒక వ్యక్తి వెళ్లడం చూశాడు.
అతన్ని చూసి ఇ శంకరం బాగున్నావా అంటూ పలకరించాడు.
ఆ పెద్దాయన్ని చూడగానే మంచి మర్యాదస్తుల వాడిలా ఉన్నాడు అనిపించింది.
నా పేరు కరం కాదండీ సుబ్బారావు మీరు ఎవరిని చూసి ఇ ఎవరనుకున్నారు అన్నాడు ‌
అలాగా ఏమనుకోకు బాబు మా శంకరం అచ్చం నీ పోలిక లోనే ఉంటాడు గుర్తు పట్టలేక పోయాను పెద్దవాడిని కదా పాపం ఎక్కడున్నాడో ఏమో నేనంటే వల్లమాలిన ప్రేమ నా దగ్గర చదువుకున్నాడు చిన్నప్పుడు బాగా క్రమశిక్షణతో చదివించే వాణ్ని ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉండి ఉంటాడు వచ్చినప్పుడల్లా నన్ను కలవనిదే వెళ్ళడు ఈ హోటల్ అంటే వాడికి చాలా ఇష్టం వద్దన్నా వినకుండా నన్ను కూడా తీసుకొచ్చి బలవంతంగా ఇడ్లీ దోస పెట్టించేవాడు.
ఆ చనువుతో పలకరించాను బాబు ఉ ఏమీ అనుకోవద్దు అంటూ మరోసారి అరిగిపోయిన రికార్డుల చెప్పాడు.
భలేవారండీ ఇంత మాత్రానికే అంతలా ఫీలవకండి మీరు పెద్దవారు నాలో మీ శిష్యుని చూసుకున్నారు నేనే శంకరం అనుకోండి మీరు ఈరోజు నా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందే రమ్మంటూ కామేశం గారిని చేయి పట్టుకుని లోపలకి తీసుకొని వెళ్ళాడు గుమగుమలాడే ఇడ్లీ సాంబార్ మినప దోశ కడుపునిండా పెట్టించాడు అంతటితో ఆ పూటకి టిఫిన్ సెక్షన్ ముగిసింది వస్తాను మాస్టారు అంటూ శంకరం వెళ్ళిపోయాడు.
ఆ తరువాత కామేశం కాసేపు లైబ్రరీ లో గడిపి భోజనం టైం కి హోటల్ ముందుకు చేరుకొన్నాడు అటుగా వస్తున్న అప్పారావు ని చూసి నువ్వు సుబ్బారావు కదూ అంటూ పలకరించాడు కాదండి నేను అప్పారావు మీరు పొరపడి ఉంటారు ఇంతకీ మీకు ఎవరు కావాలి అన్నాడు.
ఏమీ లేదు బాబు ఉ నా శిష్యుడు సుబ్బారావు అచ్చం నీ లాగానే ఉంటాడు అందుకే పడ్డాను అతను నా శిష్యుడు చిన్నప్పుడు బాగా చదివేవాడు క్రమశిక్షణతో పెంచాను అందుకే నాకు అప్పారావు అంటే ఇష్టం అన్నాడు.
ఓ అలాగా మాస్టారు నేనే మీ శిష్యుడిని అనుకోండి ఇ ఈ పూట మీరు నా గెస్ట్ గా రావాలి నాతోపాటు కలిసి ఇ భోజనం చేయాలి అంటూ చేయి పట్టుకుని తీసుకు వెళ్ళాడు తృప్తిగా విందు భోజనం పెట్టించాడు చాలా థాంక్స్ బాబు నా శిష్యుడు అంటూ దీవించాడు సాయంత్రం వరకు ఏ పార్కు లో గడిపి ఎవరైనా పరిచయమైతే ఆ పూట గడుపు అని రాత్రికి ఇంటికి తిరిగి వస్తాడు కామేశం.
ఇలా ప్రతిరోజు ఆ పెద్దమనిషికి ఒక దినచర్యగా మారిపోయింది ఉదయం సాయంత్రం వాకింగ్ పేరుతో బయటికి వచ్చి పరిచయస్తులు కాకపోయినా పలకరించి ఆప్యాయత తో పాటు ఆనందాన్ని పొందుతూ రోజులు వెళ్ళ తీసుకుంటున్నాడు.
ఆ తెల్లని ఇస్త్రీ బట్టలు వెనక నల్లటి మరక దాగి ఉందని ఎవరికి మాత్రం తెలుసు ఉ అందరిలాగానే ఆయనకి ఒక విషాద గాధ దాగి ఉంది ఉన్న ఆస్తి అంతా ముందే కొడుకు చేతిలో పోశాడు కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులే భార్య పోయినాక ఒంటరి వాడయ్యాడు ఉదయం ఎప్పటికో గాని కాఫీ చుక్క గొంతులో పడటానికి నిరీక్షించాల్సి వస్తుంది.
అన్నం కూర వండుకొని బాక్సుల్లో సర్దుకుని ఇద్దరు ఆఫీస్ కి పిల్లలు స్కూలుకి వెళ్ళిపోతారు ఇంట్లో ఒంటరిగా పలకరించే దిక్కు లేక భోజనం చేద్దాం అంటే ఇష్టమైన కూర లేక చాలా ఇబ్బంది పడతాడు.
రాత్రికి కోడలు వచ్చి వాళ్లకి ఇష్టమైనవి చేసుకొని తింటారు తనకు ఏం కావాలి అని ఒక్క నాడు అడగరుతనకు ఇష్టమైన వి ప్రేమగా చేసి పెట్టారు బరువైన బాధ్యత మోస్తున్నట్లు చూస్తారే తప్ప తండ్రిగా మామగా పెద్దవాడిగా కూడా గుర్తించరు అందుకే ఇంట్లో పొందలేని ఆప్యాయతల్ని బయట పొందాలని ఆరాటపడుతున్నాడు కామేశం తన ఒంటరితనాన్ని ప్రతినిత్యం బజారున పడతాడు.
కథ సమాప్తం రచన తాటి కోల పద్మావతి