మార్పు...అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆ ఇద్దరు పిల్లలు సెలవులకి బాగా అలవాటు పడ్డారు. బడి  తెరుస్తారు.కానీ కరోనా నిబంధనలు పాటించాలి. రోజూ మాస్క్ శానిటైజరు తో వెళ్లాలి.ఇక శివ  రాము టెన్త్ క్లాస్ కాబట్టి  మంచి బందోబస్తు  తో వెళ్లారు.ఒక వారం బుద్ధి గా  కులాస గా వెళ్లారు. శివ రోజూ  మాస్క్  కొనలేక మెత్తటి అమ్మ చిరిగిపోయిన చీర కొంగు   నాలుగు పొరలతో ఒక కళ్లు తప్ప  మిగతా మొహం కప్పుకుంటాడు. సబ్బు నీరు ఒక చిన్న ప్లాస్టిక్ సీసా లో నింపి  లంచ్ బాగ్ లో పెట్టాడు. రాము కి చదువు అంటే గిట్టదు.8వ క్లాసు దాకా  శివ మీద ఆధార పడి పైకి  ప్రమోట్ అయ్యాడు. శివ తల్లి  వారి ఇంట్లో పని చేస్తుంది. స్కూల్  తమ ఇంటిదగ్గర కాబట్టి  రాము శివ  అక్కడే చదువుతున్నారు. పైగా   అమ్మ పెట్టే అన్నం లంచ్ సరిపోదు శివ కి. నాన్న కి కూలీ దొరికిన రోజు  పండగ వాడికి.అందుకే రాము రోజూ పెట్టే రకరకాల  రుచులకు అలవాటు పడిన శివ  స్లిప్ టెస్ట్   లో రాముకి జవాబులు చూపేవాడు.నోట్సు ఇచ్చి సాయం చేసేవాడు.
ఇప్పుడు  ఇద్దరు టెన్త్ క్లాస్.!బుర్ర ఉపయోగించాలి. లెక్కలు మాత్రం  శివ చేయగలడు.కానీ గ్రామర్ రాదు. ఆరోజు  టీచర్  దూరం  దూరం గా  కూచో మని స్లిప్ టెస్ట్  పెట్టింది. కరోనా  పుణ్యమా అని చదివే పిల్లలు  బద్ధకం పిల్లల సత్తా  తెలుసుకునే అవకాశం  టీచర్స్  అందరికీ కలిగింది. శివ  సైగల తో రాము కి బిట్స్  చెప్పటం గమనించి సరోజ టీచర్ అప్పుడు ఏమీ మాట్లాడలేదు. నోట్సులు పెట్టడానికి వచ్చిన  శివ ను అడిగింది "నీవు రాము క్లోజ్ ఫ్రెండ్స్ కదూ?అందుకే  సాయం చేసి వాడిని నాశనం చేస్తావా"? ఖంగు తిన్నాడు. నెమ్మదిగా  వాడి కుటుంబ వివరాలు తెలుసుకుంది.శివ  ఏడుపు ఆపుకుంటూ అన్నాడు "మేడం!మా అమ్మ  వారి ఇంట్లో పని చేస్తుంది. అమ్మ పెట్టే తిండి నాకు  సరిపోదు. ఇంకా అడిగితే  తను తినకుండా  అంతా నాకు  పెట్టడం సెలవుల్లో చూశాను. నాన్న తాగి ఇంటికి వస్తాడు. వారి కొట్లాట నేను  వినకుండా  తలుపు మూస్తుంది అమ్మ. రాము  తన లంచ్ బాక్స్ లో ది నాకు  సగం పెడతాడు.రోజూ  రకరకాల చిప్స్  నూడిల్స్  తెచ్చుకుంటాడు. నేను చూపక పోతే నా క్లాసు నోట్సులు తీసి కెళ్ళి  నాకు ఇవ్వడు.వాడి తిండి  తినే నాకు వేరే దారి లేదు. ఆంటీ సాయం చేస్తుంది కాబట్టి రాము ని  ఏమీ అనలేను." టీచర్ కి కర్ణుడు కథ గుర్తు కొచ్చింది. దుర్యోధనుడి ఉప్పు పులుసు తింటున్నందుకే  భీష్ముడి తో సహా అంతా గప్ చిప్ గా ఊరుకున్నారు. అంతే మరునాటి నుంచి  శివ  రాములను వేరు గా కూచోమని  
కథ చెప్పి  నిజమైన మిత్రులు  చెడు మార్గం లో పోతుంటే సరిదిద్దాలి.లేదా  టీచర్  హెచ్. ఎం.కి చెప్పాలని జ్ఞాన బోధ చేయటంతో అంతా తల దించుకున్నారు. టీచర్  రోజూ  లంచ్ టైంకి  తన దగ్గరకు నోట్సులు  తెచ్చే శివ కి పండు ఇస్తోంది. అందరిముందు  ఇస్తే  శివ చిన్న పుచ్చుకుంటాడు.మిగతా వారి కి  అసూయ కలుగుతుంది.  ఆరోజు నించి  శివ తల్లిని తన ఇంట్లో పనికి పెట్టుకున్న ది. రాము కి ఫ్రీగా ఇంట్లో  చదువు చెప్తోంది. వాడు అన్నాడు "టీచర్!శివ ని కూడా  మీఇంట్లో  చదువు కోటానికి రమ్మని చెప్పండి  ." 'వద్దు! వాడి తంటాలు  వాడు పడాలి." రాము లో మార్పు  వస్తున్న ది  నెమ్మదిగా.!
కామెంట్‌లు