తొలితరం గేయ రచయిత బలిజేపల్లి లక్ష్మికాంతం.:-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్

 

 వీరు గుంటూరుజ జిల్లా బాపట్ల తాలూకా  ఇటికంపాడులో1881 డిసెంబర్ 23 న  జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసింహశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ. వీరు తన మేనమామ భాగవతుల చెన్నకృష్ణయ్య వద్ద విద్యాభ్యాసం, మేనత్త సరస్వతమ్మ వద్ద భారత భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను చదివి,  కవిత్వం చెప్పడం నేర్చుకున్నారు.
 కర్నులు మెట్రిక్యులేషన్ చదివిన తర్వాత సబ్ రిజిస్టార్ ఆఫీసులో గుమస్తా గాను, కొంతకాలం గుంటూరు  హిందూ కళాశాలలో ప్రధానాంధ్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత అవధానాదులలో ప్రజ్ఞాపాటవాలు సంపాదించి తెలుగు దేశంలోని సంస్థానాలనుసందర్శించి అవధానాలు  ప్రదర్శించారు.
 చల్లపల్లి రాజావారి సాయంతో 1922లో  గుంటూరులో చంద్రికా ముద్రణాలయం స్థాపించారు.  ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని  చెరసాల శిక్ష అనుభవిస్తున్న కాలంలో సత్య హరిశ్చంద్రీయ నాటకం రచించారు. 1926 లో గుంటూరులో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి వీరు సత్యహరిశ్చంద్రీయ, ఉత్తర రాఘవాది నాటకాలు పలుమార్లు ప్రదర్శించారు. వాటిలో వేషాలు ధరించి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. వీటిలో  నక్షత్రకుడి పాత్ర వీరికి ఇష్టమైనది.
తర్వాత కాలంలో  చిత్తజల్లుపుల్లయ్యగారి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేసించి 'లవకుశ '(1934)  'హరిశ్చంద్ర' రచయిత.(1935) 'అనసూయ' రచియిత. (1936) 'మళ్ళిపెళ్ళి' నటుడు-మాటల రచయిత. 'వరవిక్రయం'నటుడు.మాటల రచయిత.(1939) ' భూకైలాస్' మిటల రచయిత.(1940) 'విశ్వమోహినీ' మాటల రచయిత.(1940) 'బాలనాగమ్మ'నటుడు-రచయితగా (1942)'తాసీల్దార్' నటుడు మాటల రచయిత. (1944) 'సీతారిమజననం' విశ్వామిత్రుడిగా.(1944)' భీష్మ' నటుడు (1944) 'బ్రహ్మరధం' నటుడు,కథ,పాటల రచయిత.(1947) (1949) (1951)'నాచెల్లెలు' 'మంజరి' నటుడు,మాటల రచయిత. (1953)  'జీవితనౌక' మాటలు,పాటల రచయిత.(1951) ఇలా అనేక చిత్రాలకు కథలు, సంభాషణలు, పాటలు రాసి, కొన్ని పాత్రలు ధరించి ప్రఖ్యాతులయ్యారు.
వీరు 1953 జూన్ 30 న కాళహస్తిలో పరమపదించారు.
.