*భారతీయులు*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బాలలండి బాలలు
విరిసిన పూదోటలు
బాలల నవ్వులు
సుగంధాలు వెదజల్లెడి
పూచిన పువ్వులు
బాలల ఆటలు
గాలికి అలా అలా వూగే
చిరు చిరు రెమ్మలు
బాలల సవ్వడులే
చిలిపిగ కదిలే
ఆకుల గలగలలు
బాలలె కద ఈ
తోటలోని అందమైన
రూపము గల మొక్కలు
ఈ మొక్కలె కద
భావి తరపు
ఘన వృక్షాలు
ఈ బాలలె కద
భావి తరపు
ఘనకీర్తి భారతీయులు!!