మన ఆచారవ్యవహారాలను సంస్కృతి అంటాము ఈసంస్కృతి మన జీవిత నడవడికకు ఎంతో దోహదపడుతుంది. పాఠ్యాంశాలుగాకాని నీతికథలుగా కాని లేక పద్యశతకాలద్వారాకానీ బాల్యంనుండే మనకు ఎన్నో నీతిదాయక విషయాలు బోధిస్తారు. తల్లి,తండ్రి,గురువు,దైవం అని పెద్దలు మనకు చెప్పారు.అలా పెద్దలను గౌరవించడం మనసంస్కృతిలోభాగం.నేడు ప్రపంచం అంతటా జరుపుకుంటున్న ఫాదర్స్ డే మనం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఆచరించిచూపాము తండ్రిని దైవంగా భావించమని మన సంప్రదాయం చెపుతుంది.తండ్రి ఇచ్చిన వరం నెరవేర్చడానికి అరణ్యలకువెళ్ళాడు.తండ్రి ఆజ్ఞతో తల్లినే సంహరించి తిరిగి తండ్రి అనుగ్రహంతో తల్లిని బ్రతికించుకున్నాడు పరశురాముడు.తండ్రి ఆనందకొరకు ఆజన్మ బ్రహ్మచారిగా మారాడు భీష్ముడు.తండ్రికి తనయవ్వనాన్ని ధారపోసాడు పురూరవుడు.ఎందరో మహనీయులు తమసాహిత్యంలో తండ్రి పాత్రకు సముచిత స్ధానం కలిగించారు.తండ్రి తండ్రి ద్వారానే ఈదేహం ఇహపరాలు సాధించే హితాన్ని విద్యాబుధ్ధులు నేర్వడానికి ఆర్ధిక సామాజిక ఆలంబన ఇస్తాడుకనుక 'పిత్రుదేవోభవ' అన్నారు.
'ఉపాధ్యాయాన్ దశాచార్య. ఆచార్యాణాం శతంపితః'
నూరుగురు ఉపాధ్యాయులకంటే,ఒక ఆచార్యుడు,నూర్గురు ఆచార్యులకంటే తండ్రి అత్యధిక గౌరవము ఉన్నవాడని వేదాలు చెపుతున్నాయి.
'భూమేర్ గరీయసీ మాతా.. స్వర్గాదుచ్చ తరం పితా'
భూమికంటే తల్లిగొప్పదనిచెపుతూనే స్వర్గం కన్ని తండ్రి గొప్పవాడని శృతి చెపుతుంది.
బైబిల్ ప్రకారం "ఫాదర్"గొప్ప గౌరవ వాచకం.అబ్రహంను 'ఫాదర్ ఆఫ్ ఫెయిత్ 'గా భావిస్తారు.'సానోరాడాడ్'అనే ఆవిడ 1910/ జూన్ /19 వ తేదిన తొలిసారి ఫాదర్స్ డే నిర్వహించారు. ఈమె తండ్రి'విలియం స్మార్ట్' అమెరికా సైన్యంలో పనిచేసేవాడు. ఇతనిభార్య ఆరో సంతానానికి జన్మనిస్తూ మరణించింది.యుధ్ధనంతరం ఇంటికి వచ్చిన అతను భార్య జ్ఞాపకాలతో తనసంతతిని పెంచి పెద్దచేసాడు.తనతండ్రి ఎంతో ప్రేమతో తమని పెంచడం గమనించిన అతని పెద్దకుమార్తె సానోరాడాడ్ తనతండ్రికి కృతజ్ఞతగా తన తండ్రి పుట్టిన రోజునే 'ఫాదర్స్ డే'జరపాలని నిర్ణయం తీసుకుంది.ఆనిర్ణయానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు 'కాల్విన్ కూలిడ్జి' తనమద్దత్తు 1924 లో ప్రకటించాడు.1936 లో అమెరికాలో జాతీయ ఫాదర్స్ డే కమిటి ఏర్పడింది. 1966 అప్పటి అమెరికా అధ్యక్షుడు'లిండన్ జాన్స్ న్' దీనికి అధికార ముద్రవేసారు.అప్పటినుండి ఏటా జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి