వీరదుర్గాదాస్...అచ్యుతుని రాజ్యశ్రీ

 మనదేశం కర్మభూమి పుణ్యభూమికూడా. ఉత్తర భారత దేశం విదేశీ దండయాత్ర లతో అతలాకుతలం అయింది. రాజపుత్రులు ధైర్య సాహస శౌర్యప్రతాపాలకు పెట్టింది పేరు.
ఆబాలుడికి పన్నెండు  పదమూడేళ్ల వయసు.ఊరిచివర ఉన్న చెరువు దగ్గర కత్తి సాము అభ్యాసం చేస్తుండేవాడు. ఒకరోజు అతను చెరువు దగ్గర వ్యాయామం చేస్తుండగాఒంటెపై స్వారీ చేస్తున్న ఒకడు కనపడ్డాడు.అతను జోధ్పూర్ రాజు సందేశం  తీసుకుని వెళ్ళుతున్న వార్తా హరుడు. అక్కడున్న చేలమధ్య దగ్గర దారిలో వెళ్ళాలని అతను ప్రయత్నిస్తుంటే ఆపొలంరైతు అడ్డంగా నిలబడి "బాబూ!నాపంట అంతా నాశనం అవుతుంది.  బాట పైనే వెళ్ళు"అని మర్యాదగా చెప్పాడు.కానీ  అతను అహంకారం తో మొండి గా వెళ్తుంటే  రైతు  అడ్డుకున్నాడు. అంతే  రైతు ని కొరడాతో బాదసాగాడు.రైతు ఏడుపు పెడబొబ్బలువిని కత్తి సాము  చేస్తున్న  ఆపిల్లాడుపరుగున వచ్చి  సంగతి తెలుసు కున్నా డు."పొలంమధ్యనించి ఒంటె తోవెళ్తేపొలం నాశనంఅయి రైతు కినష్టం కలగదా?""ఒరే పిల్లకుంకా!నేను  జోధ్ పుర్ మహారాజు కి వార్తా హరుడ్ని.రైతు సంగతి  నాకు  అనవసరం. "అనగానే ఆబాలుడు కత్తి తో ఒంటె ను గాయపరిచాడు. అంతే అతను సరాసరి  రాజుదగ్గరకెళ్లి నేరారోపణ చేస్తాడు. రాజు ఆ పిల్లాడి ని పిలిపిస్తాడు.జరిగింది చెప్పాడు.నేను చేసినది తప్పు కాదు  అన్న  ఆపిల్లాడి  సాహసంని మెచ్చుకుంటూ వార్తా హరుని జైల్లో  పడేసి ఆపిల్లాడి ని తన దగ్గర  ఉంచుకుంటాడు. అతనే వీరదుర్గాదాస్  .జోధ్పూర్ ని మొగలుల నుంచి కాపాడిన  వీరుడు.చరిత్ర లో నిలిచిన  సాహసి!