పుట్టినరోజు (బాల గేయము)-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
కొత్త బట్టలు వేసింది
చాక్లెట్ డబ్బా తెచ్చింది
దేవుని ముందు పెట్టింది 
దీవెనలిమ్మని మొక్కింది


నాన్నకు మొక్కతు ఇచ్చింది 
అమ్మకు మొక్కి ఇచ్చింది 
తాతకు నవ్వుతు ఇచ్చింది 
అవ్వతొ ఆడుతు ఇచ్చింది 

మిత్రులందరికి ఇచ్చింది 
మేడం గారికి ఇచ్చింది
గురువు లందరికి ఇచ్చింది
హ్యాపీ బర్త్డే నాదంది.
హ్యాపీ బర్త్డేనాదంది.

కామెంట్‌లు