*చిత్రపద్యములు*:-మిట్టపల్లి పరశురాములు--సి ద్దిపేట
 *కం*
*నల్లని కురులది చిన్నది*
*విల్లును హస్తమునదాల్చె వీరవనితగా*
*కళ్ళనుపెద్దగజేసియు*
*నుల్లము పొంగగనునామె యురికెను పోరున్*
2.
*కం*
*చక్కనిచిన్నదిజూడగ*
*మిక్కిలిపౌరుషముచేతమీటుచుశరమున్*
*చక్కగవిల్లునుచేకొని*
*మక్కువ మీరగ రణమును మరిమరిజేయన్*
*3*
*మానిని*
*నల్లనికేశములున్నవిచిన్నది-నాజుకుతీరుగయుద్దమునన్*
*విల్లునుచేతనుబట్టినకాంతనె -వీరునిమాదిరివెళ్ళెనుగా*
*కళ్ళకుకాటుకదిద్దినమానిని-కాలునితీరుగసాగెనుగా*
*నుల్లముపొంగగ శక్తిచె జోరుగ-నూగెనుకాళికయుద్దమునన్*
                     ****