చిరునవ్వు: -:యాళ్ళ ఉమామహేశ్వరి
ప్రక్రియ: సున్నితం: -రూపకర్త::: నెల్లుట్ల సునీత
****************************************************
చిరునవ్వులు రువ్వు ఆనందంగా
 సంతోషం నిండు మధురంగా
ఆత్మీయతను పంచు అనుబంధంగా 
చూడచక్కనితెలుగు సున్నితంబు.

నవ్వు ఆశలు తీర్చును   
దరహాసం ఆనందం‌ నింపును    
మనకు ఆరోగ్యం పంచును
చూడచక్కని తెలుగు సున్నితంబు.

పసిపాపాయి బోసినవ్వులు   
మనసంతా నింపును సంతోషాలు   
హాయిగా సాగిపోయేను అనుబంధాలు
చూడచక్కని‌ తెలుగు సున్నితంబు.

నవ్వే పెదవుల అందం  
ఆనవ్వే ఇంటికి‌ చందం    
పూయించాలి నవ్వుల సుమగంధం
చూడచక్కని తెలుగు సున్నితంబు.

హాయిగ చిరునవ్వులు నవ్వర
 మరచి ప్రశాంతతను విడువకుర
నవ్వుతూ ఖుషీగా సాగిపోర
చూడచక్కని తెలుగు సున్నితంబు.