అప్రమత్తతే (బాలగేయం):-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
సంపాదించాలీ  జ్ఞానం
విడిచేయాలీ అజ్ఞానం
కలిగి ఉండాలి సహనం
అప్రమత్తతే ఆయుధం

ఉండాలింతా విశ్వాసం
చిరునవ్వులే ఔషధం 
పలకరింపులు స్నేహం 
కలిసి చేయాలి భోజనం 

వదిలేయాలి ఒంటరితనం
కలుసుండాలి సమూహం
విడిచి పెట్టాలి గర్వం 
పెనవేయాలి  బంధం