రాయి:- సత్యవాణి
ఓ రాయీ!
నువు చేసిన పుణ్యమేమి
నేచేసిన పాపమేమి

నీకేమో గుడిలో ఆరాధనలా
నాకేమో గుడిబైట 
పదఘఠనల మొట్టికాయల  

ఓ రాయీ!
నువు చేసిన పణ్యమేమి
నే చేసిన పాపమేమి

నీపై పరమళ గంధం అరగ తీతలేమీ
నాపై ఉప్పు చేపలరగతీతలేమీ

ఓ రాయీ!
నువు చేసిన పణ్యమేమీ 
నే చేసన పాపమేమీ 

నీవేమో బంగారం వన్నె తెలిపే గీటురాయివా
నేనేమో ప్రాణం తీసే వడిశ రాయినా

ఓరాయీ నువు చేసిన పుణ్యమేమీ
నే చేసిన పాపమేమి

నీవు తిండి పెట్టు తిరగటి రాయవా
నేనేమో పడగొట్టి పండ్లూడగొట్టే పాకుడు రాయినా

ఓరాయీ! నువు చేసిన పుణ్యమేమి
నే చేసిన పాపమేమి

నీకు ఏసీ గదులలో అంగరంగ  వైభవాలా
నాకు బయట  ఎండా వానలలో
మరిగి మునగడాలా

ఓరాయీ నువు చేసిన పుణ్యమేమి
నేను చేసుకొన్న పాపమేమీ

ఓరాయీ! నీలో  కలిగిన మెత్తదనమే నీకు వరమైనది.
నాలో వున్న కఠినత్వమే నాకు శాపమైనది