మొక్కలు నాటుసంరక్షించు:---నెల్లుట్ల సునీత
పుడమి తల్లి విలవిలలాడుతూ అక్రోషిస్తుంది
ఎవరికీ చెప్ప లేని ప్రసవ వేదనల మధ్య
మూగ రోదనలతో విలపిస్తుంది

 వికృత చేష్టలతో విఘాతం కలిగిస్తూ
వింత పోకడలు మనుషులు
విపరీత ధోరణులు మధ్య ప్రకృతి మాత కొట్టుమిట్టాడుతోంది

కాలాలు గతి తప్పి తిరోగమనం వ్యవస్థలో తిరుగుతున్నాయి
ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు
కొత్త కొత్త వింత రోగాలు

జీవ నిర్జీవ సమాహారంగా
ప్రకృతి శక్తి పర్యావరణంగా
జీవవైవిధ్యంలో అంతర్భాగంగా
జీవన గమనం సాగిస్తూ

విలాస వికాసం కోసం వ్యర్ధాలను విసిరి పారేస్తూ
విఘాతాలకు కారణమవుతూ
అపశృతులు రాగమాలపిస్తూ 
ఏవో శృతితప్పిన గానాలు వినపడుతున్నాయి
అంతా ఆధునిక మే

సంప్రదాయ సిరులు ఎక్కడ
ముందు తరాలకు సహజ సంపదను
అందించాలన్న ఆలోచనలను తుంగలో తొక్కి
స్వార్థ ప్రయోజనాల స్వలాభం కోసమేగా
ప్రకృతి ధర్మాన్ని పాటించక
వేటు వేస్తున్నారు

ప్రకృతి వనవాసం సమస్త జీవకోటికి నివాసంగా జీవిస్తూ
శాంతియుత ఆరోగ్యానికి 
చెట్లను నాటి
పుడమి కి పురుడు పోదాం

ప్రకృతి మాతను పదిలంగా పొత్తిళ్లలో దాచేసి


అత్యాశ లు వదిలి కలుషితం కానివ్వక కొండకోనలను సహజంగా ఉండనిచ్చి ప్రాణవాయువును  పోగేద్దాం
మహిని మలయమారుతంగా మార్చుదాం

అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా సాగి
తరువులే మానవ ఆదెరువు లని
భావితరాలకు బంగారు బాటలు వేద్దాం
కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం
అచ్చమైన స్వచ్ఛమైన పర్యావరణం అందరి బాధ్యత కావాలిగా సర్వ జీవకోటి సంరక్షణగా