9)
అతడి బాధ చూసి నాదు
మనసుకు జాలి కలిగినది
కరుణతొ కన్నీటి ధార
జలజలమని ఏరయినది!
10)
ఆ స్థితిలో ఆ తాతను
చూడలేక పోయినాను
చిరు సాయము చేసి నేను
ఆసుపత్రి చేర్చినాను!
11)
అందుకె ఈరోజు నాకు
అయినది ఆలస్యము బడికి
తప్పు చేస్తె శిక్షింపుడు
జాగయినది క్షమియింపుడు!
12)
ఆ మాటలు విన్న టీచరు
ఆనందముతో పాపను
అక్కుననే చేర్చుకునెను
చక్కగ దీవెనలిచ్చెను !!
(సశేషం)
*కరుణామయి*(గేయకథ)(మూడవభాగం):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి