మానవుడు:-ప్రతాప్ కౌటిళ్యా (( కె ప్రతాప్ రెడ్డి))
విషముఅమృతం వేరు చేసినట్లు పాలు నీళ్ళు వేరు చేసినట్లు
గాలిని వేరుచేసి శ్వాసించిన అంగం యంత్రాంగం దేవతలు దానవులకు దక్కలేదు మానవులకు తప్ప !?


గీసిన బొమ్మల చెక్కిన శిల్పంలా విచిత్రంగా ఉన్న దేవా కన్యలకు రెక్కలిచ్చీ ఆకాశ మార్గాలు వర్షించిన పంచామృతం నీరును త్రాగిన మొట్టమొదటి వీరుడు ఎవడో కాదు మానవుడు !?

ఐరావతం అవతారం పారిజాతం జాతీ వృక్షం మానవ జాతి లక్షణం మానవత్వం!?

భూమిపై కాలుమోపనిపక్షిలా రెక్కలతో ఆకాశంలో ఎగురుతున్న దేవతలను గుళ్ళల్లో బంధించి భూమిపైకి దించిన తొలి మానవుడు వాడు !?

విశ్వశక్తిని రక్తం గా మార్చి నాలుగు దిక్కుల్ని
నాలుగు గదుల్లో బంధించి అఖండ గంటానాదం మ్రోగించి ధ్వజస్తంభం లా నిలబడ్డ గుండె లో అఖండ దీపం

వెలిగించి నది మానవుడు !?

మంత్రదండం తో పుట్టిన తాతముత్తాతల దేవతల్ని తలలోనే పిండాన్ని సృష్టించి సృష్టి రహస్యాన్ని చేదించిన క్షీరదం మనిషి !?

దృశ్యాల్ని కరిగించి వంచీ గీతల్లా అక్షరాల్లా అల్లికలు అల్లి కళ్ళకు వస్త్రాల్లా తొడిగి రెప్పల మధ్య బంధించిన తొలి దృశ్యం మానవుడి దీ !?

Pratapkoutilya
Lecturer in Bio-Chem
8309529273