ప్రపంచానికి వెలుగునివ్వు(కైతికాలు):- రమేశ్ గోస్కుల-- కైతికాల రూపకర్త,భువన సాహిత్య విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు.
వరమిచ్చే ప్రకృతి 
ఒడిలో పుట్టిన వాన్ని
వరాలను కూల్చుతున్న
అంధత్వ నిర్భాగ్యున్ని
నేలపైన మనిషిని
కూర్చున్న కొమ్మను కూలుస్తున్న వాన్ని!

నేలను చెరబట్టి
రసాయన స్నానాలు
గాలిని విషం నింపి
నింగి నేల వినాషాలు
నిరంతం స్నేహ శీలినైన
విర్రవీగు అహం భావిని

గంగా జల పవిత్రతను
కల్మషాల బలి చేస్తూ
గరళాన్ని నాడుల్లో 
కొంచెంగా దాచేస్తూ
ఆధిపత్యంకై అర్రులు చాచి
ధరణి నేలుతున్న దానవేంద్రుడను

ప్లాస్టిక్ భూతం చేతిన
బంధీనై బతుకుతున్న
యంత్ర రాక్షసి కోరలకు
తనువు తాకట్టెడుతున్న
కాయం కుళ్ళు తున్నా
పై పూతలకు పరవశిస్తున్న

ఆలోచన పాతరేసి
అణువంత కూలుస్తూ
అభివృద్ధి జపం చేసి
వికృతి విహరింపజేస్తూ
వినాశనాన్ని వాటేసి 
విలయతాండవ విధాత నైన

కిరణానికి ఎదురెళ్లి
కూర్చు కుంటు దైన్యాన్ని
ఓజోన్ గర్భం చేర 
చేస్తున్న పయణాన్ని
ఎవరెంత ఈసడించిన
విడవని ధౌర్భాగ్యున్ని

తిండి కల్తీ తీరనిది
నీరుకల్తీ ఆరనిది
ఉప్పు కారం కూడా
ముప్పుగానే మారినది
రోగాలకు వంతెనేస్తూ
భోగంలో మునిగున్నం

కాపాడి

నింగి నేల
ఆయుష్షుకు అడ్రసవ్వు
గోడనెక్కె మిషతోడ
గోతిలొ కూలకు నువ్వు
ప్రకృతిని కాపాడి
ప్రపంచానికి వెలుగునివ్వు 
           
మిత్రులకు శ్రేయోభిలాషులకు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు