మీ ..జీవన సూత్రం తో ....!!:---డా.కె .ఎల్ .వి.ప్రసాద్ , హనంకొండ.
నాయనా .....,
మన కానేటి కుటుంబంలో 
మీరు ప్రత్యేకం ...!
క్రమశిక్షణలో ...
మీకు మీరే సాటి .

ఎందరి జీవిత వ్యధలనో 
పరిష్కరించి,
వారి జీవితాలలో 
ఆనంద సుధలు పండించిన 
విశాల హృదయం మీది !

సామజిక సమస్యల 
న్యాయ వితరణలో ,
మీ మాటకు తిరుగులేదు ,
మీది తాతా చారి ముద్ర ..అంతే !

ప్రజా పొరాటంలో.
జైలు జీవితానికి 
వెనుకంజ వేయలేదు మీరు ,
కొద్ది చదువుతోనే ...
కార్ల్ మర్క్స్ ను విశ్లేషించిన ,
ఘనాపాటి మీరు !

మర్యాద ....
ఇచ్చి ..పుచ్చుకోవాలనే 
జీవన సూత్రాన్ని ...
ఉగ్గుపాలతోనే ...
మీరు మాకు వడ్డించారు !
క్రమ శిక్షణ జీవితానికి ,
కసరత్తు చేయించారు !!

అంతలో కొంతైనా పాటించి ,
మీరు అందించిన వ్యక్తిత్వాన్ని,
పదిలపరచుకుంటూ ...
గౌరవంగా బ్రతికేస్తున్నా !

నాయనా ..
నేను ఏమిచేసిన ,
క్షణ క్షణం గుర్తొచ్చేది మీరు ,
కానేటి తాతయ్య ...
కనిష్ట కుమారుడిగా ...
నాకు ఎంత గర్వమో ...!
(ఫాదర్స్ డే సందర్భంగా మా నాయనకు నివాళి )



కామెంట్‌లు