వార్తాపత్రిక.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 తెల్లవార్లు యంత్రంలో నలిగిపోయి. 
వేకువ వెలుతురు రాకముందే 
ప్రభాత గీతంలా మేల్కొలుపుతావు. 
అందంగా ముస్తాబై రెక్కలు చాచుకుని 
ప్రతి గుమ్మంలో వాలు తావు.
ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకొని
 నీ దేహం పై ఒక్కొక్కటి 
వలువలు ఊడ దీసి 
శరీరమంతా పరచుకున్న 
సువర్ణ అక్షరాలను 
కళ్ళతో పలకరించి 
పెదవులతో తడుముతుంటే 
తీపి వార్తలు చావు కబుర్లు 
వింతలు వినోదాలు 
ఎక్కడ ఎక్కడో జరిగిన సంఘటనల 
ప్రతిబింబాల కు అర్థం పట్టి 
మంచి చెడులను కక్షలు దౌర్జన్యాలను
 దోపిడీలు కిడ్నాప్ లంటూ 
అశేష జనావళికి విశేషంగా
 అందించే సామర్థ్యం నీకే దక్కింది.
ప్రభుత్వ విధానాలను
 ప్రజాభిప్రాయాలను 
వివిధ ప్రాంతాలలో ప్రభావితం చేస్తావు.
మారుమూల జరిగిన నేరాలను ఘోరాలు 
జాతీయ అంతర్జాతీయ సమాచారాలను 
సమగ్రంగా వివరిస్తావు. తెల్లవారింది 
అంటే ఉషోదయం కన్నా 
నా ముందే నీ రాక కోసం ఎదురుచూపులే.
మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు
 అక్షరం పొల్లు పోకుండా చదివి
 నీ దేహాన్ని నలిపి మలినం చేసేవరకు 
వదిలిపెట్టరు.
అయినా నీ రూపం ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది.
అక్షరాగ్ని వై ఆయుధంలా విజృంభించి
 నిరక్షరాస్యులు సైతం 
చైతన్యవంతుల్ని చేసే దివ్య సాధనానివి.
నిన్ను మలచిన ఎడిటర్లు విలేకరులు 
జర్నలిస్టులు అందరి చేతుల్లోంచి 
సుందరంగా రూపుదిద్దుకొని 
ముస్తాబై వస్తావు. కలం ఆయుధంతో 
పురుడు పోసుకున్న
 ప్రతినిత్యం కొత్త జన్మ ఎత్తు తావు.
కవిత వార్తాపత్రిక.

కామెంట్‌లు