*అంగీకారం*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బాలల అనురాగం
బాలల అభిమానం
బాలల ఆప్యాయత
బాలల ఆత్మీయత
బాలల ప్రేమ
చవిచూసినవారు
జాబిల్లిగా విరిసి
వెన్నెలగా కురిసి
నిండుగోదారిలా ఝరిసి
ఆనందపు ఉప్పెనలో
కొట్టుకుపోతూ
అనూహ్య దిగంతాహ్వానాన్ని
మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు!!