నానీలు...!! (యోగా): --------డా.కె.ఎల్.వి.ప్రసాద్ , హన్మకొండ .
 వళ్లువంచితే ....
కండరం కదిలితే ,
అవయవాలు -
నలిగితే, అది' యోగా '!
---------------------------------
కొవ్వును కరిగించి ,
బరువును తగ్గించి ,
శరీర సౌందర్యం -
పెంచేదే యోగా ..!
-----------------------------------
రేపటి కోసం...
ఎందుకు మనాది!
యోగాను నమ్మడం 
ఆరోగ్యానికి పునాది !!
-------------------------------------
క్రియాభరితం ....
మన జీవన గమనం !
అనారోగ్యానికి.....
అదేకదా కళ్ళెం ...!!
----------------------------