షాడోలు (క్రీనీడలు ) సైకిల్ :--- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

జీవిత మార్గము 
సైకిల్ చక్రము 
విధియె సక్రమము 
సరిగా నడుపుట తెలివి ఉమా!

నీతియె బ్రేకులు 
ఓరిమి రిమ్ములు 
ధైర్యం సీటులు 
సవ్యం చేయును మార్గముమా!

సైకిల్ నేర్చుట 
బాల్యం ముచ్చట 
పడటం అచ్చట 
ఎవ్వరి కైనా ఒకటె ఉమా!

రివ్వున పోదుము 
ఠక్కున ఆగుము 
అదిరాజరికము 
ఠీవిని ఇచ్చును సైకిలుమా!

సొంతం రిపేరు 
తెలిసినను పేరు 
సులభము అనేరు 
సైకిల్ షాపుఉపాధి ఉమా!

బ్రతుకు చక్రమిది 
తిరుగుతు ఉన్నది 
బాటను తోడది 
మధ్య తరగతికి మిత్రుడుమా!