రైతేరాజు(ఇష్టపదులు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
1.పుడమితల్లిని నమ్మి పూజ చేసే పుత్రుడు
అంకురాలను విత్తి ఆహారాన్ని ఇచ్చి

మనలను రక్షించే మహనీయుడే తాను
అన్నదాత అయినా అహంకారం లేదు

ఉన్నదానితోనే ఊయలపై నిలుచును
లేనిదాని కోసం లేశమైన వగచడు

దేశానికి నేస్తం దేనికైన ఊతం
చెమట చిందించి పని చేలకెెంతో హాయి

2.కృషీవలుడు అయినను కృంగిపోడు ఎప్పుడు         
హలంతో పనిచేసి హాలికుడై నిలుచును

ఆరుగసలం

లోను ఆశ తానై దున్నును
అవనిని దేవతగా అమృతం పండించును

ఊరికి అతడొక్కడు ఊపిరిగా తోచును
ఈసునసూయ లేని ఈశుడే యగు నతడు

డబ్బులు లేని రాజు డాబులు లేని వాడు
దమ్మున్న మారాజు దాతగా నిలిచేను.