*ఇల నడిచే తారలు!*:- డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.పిల్లలు ప్రపంచం ఎల్లలు!
  కల్లలు తెలియని మల్లెలు!
  దైవాల నిజరూపాలు!
  ఇల నడిచే తారలు!
  మానవతా ఆశాదీపాలు!
  సుందరభవితరూపాలు!
  విశ్వ భద్రతా కవచాలు!
  పాలు త్రాగిద్దాం!
  పాపాల నుండి రక్షిద్లాం!
2.మనిషి, సృష్టి అగ్రగణ్యుడు!
   శిశువు, అతడి ఆద్యుడు!
   శిశువు చైతన్యకేంద్రం!
   చిరునవ్వు ఆనందసంద్రం!
3.పిల్లల్ని సరిగా పెంచు!
   వారే ప్రపంచం నిర్మించు!
   పిల్లలు లేని దంపతులు!
అనాధలై అలమటించే పిల్లలు!
  వీరి మధ్య సమన్వయం!
   అభ్యుదయం అభయం!
4.పిల్లల శరీర పోషణ!
   సరి బుద్ధి శిక్షణ!
   పిల్లల ఆరోగ్యం!
   విశ్వ మహాభాగ్యం!
   పిల్లలు క్షీరం!
   విరిచేయడం మహానేరం!
5.పెద్దల నిత్యం ఆశ!
   వారి నిరంతర ధ్యాస!
   పిల్లలే రేపటి మన ఆశ!