మా నాన్న:-ప్రతాప్ కౌటిళ్యా((కె ప్రతాప్ రెడ్డి))

 నునులేత  పువ్వు కింద ఒక ముళ్ళు ఉంది
 దాని రక్షణకోసం అది మా నాన్న

 ఆకాశమంత విస్తరించిన  మహా వృక్షం
 మర్రి చెట్టు లా
 తన పైకి ఎక్కడానికి నేలపైకి  ఊడలనీ దించిన
 దేవుడు మా నాన్న

 విషాద సంసారసాగరంలో
 అనురాగమేఘాల్ని పుట్టించి
 దుఃఖం ముఖచిత్రాన్ని మార్చేసి 
 చిరునవ్వుల్ని పెదవులపై  పూయించిన
 ఒక నక్షత్రం మా నాన్న 

 భూమ్యాకాశాలు ని చేదించి ఒక దగ్గరికి చేర్చిన 
 ఒకానొక రేఖ భాగంలో భూమిలా ఉన్న
 అమ్మకు శిగలో నెలవంకను చేర్చి నుదుట సింధూరం సంధ్యను దిద్దిన
 ఆఖరి సూర్యుని ఆకారం
 తొలి పొద్దు సింగారము ఆమె మెడలో వెలుగు పూలమాలవేసి
 పాదాలకు పారాణి పూసి ఆ సముద్రం తనలో
 కలుపుకున్న సగం సూర్యుడే  మా నాన్న

పారీ పారీ వేయి ఏళ్ళు నిండిన ఎండీ పోనీ
 గుండె మా నాన్నది

 ఖండాలు దాటి సముద్రాల్ని ఇది
 అనంత అవకాశాల్ని ఎగిరిన ఏకైక పక్షి ఒకటి
 తన గూటిని చివరికి చేరి ఇక రెక్కల్ని విడిచిపెట్టి
 మా నోటిలోకి కళ్ళు తినిపించి
 మాకు కోటి రెక్కల్ని శతకోటి కంటి రెప్పల్ని సృష్టించి ఆ గదిలోనే
 మా కోసం వేచి ఉన్నా సుదూర ప్రయాణం లో
 ఒక బాటసారి మా నాన్న

 వెచ్చని రక్తంతో  ఆకుపచ్చని ఆకాశాన్ని ఏర్పరిచి
 అన్నం ముద్దలు చేసి ఆకలి కడుపులు నింపి
 కన్నీటి కుండలిని పగులగొట్టి వెన్నెల
 వెన్నముద్దలు తినిపించి
 ఆ సమయానికి ఒక వెలుగు వెలిగిన ఒక
 సూర్యుడు ఒక చంద్రుడు మా నాన్న

 ఐరావతంలా ఎదిగి  పర్వతాలని మోసి పద్నాలుగు లోకాలు చుట్టి చిట్టచివరికి
 ఒక చెట్టు లా పుట్టి ఎండిపోయి
 పొయ్యిలో మండుతున్న ఒక అగ్ని శిఖరం మా నాన్న

 ఏ యుగానికి అయినా చెరి సగానికి చెందిన
 ఒక రాముడు ఒక కృష్ణుడు మా నాన్న

Today Father's day
Pratapkoutilya lecturer in Bio-Chem