కోటి రతనాల వీణ తెలంగాణా.....:---మొహమ్మద్. అఫ్సర వలీషా --ద్వారపూడి (తూ గో జి)

ఐదు వేల  వసంతాల 
 సాంస్కృతిక చరిత్ర కలిగినది
 ఆణిముత్యం లాంటి తేట
 తెలుగు స్వాతిముత్యం 
ఈ తెలంగాణం....

కాకతీయ రాజ వంశీయులతో
కుతుబ్ షాహీ,అసఫ్ జాహీ
ముస్లిం రాజులతో పాలింపబడ్డ
కళలకు పట్టం కట్టే  రెండు
 వేర్వేరు సంస్కృతుల  సంస్థానమిది ...

కాకతీయ పండుగైనా
బోనాలు ,బతుకమ్మ,దసరా ,
 సంక్రాంతి,మీలాద్ ఉన్
 నబి,రంజాన్ యైనా కలిసి కట్టుగా చేసుకునే
 సాంప్రదాయం , విభిన్న
 భాషలు  కలది...

ఉత్తరానికి దక్షిణం 
దక్షిణానికి ఉత్తరంగా 
గంగా యమునల తెహజీబ్ గా
భారతదేశంలోనే హైదరాబాద్ ప్రసిద్ధి....

ఉర్దూ కవి కులీ కుతుబ్ షాతో
 కలిపి పోతన, కంచర్ల గోపన్న 
మల్లియ రేచన, గోన బుధ్ధారెడ్డి, 
పాల్కురికి సోమనాథుడు,
 మల్లి నాధ సూరి, హుళక్కి
 భాస్కరుడు ప్రాచీన కవి
 తంత్రుల సమూహమది...

ఆధునికత సంతరించుకున్న
 తెలుగు సాహిత్య అకాడమీ    
గ్రహీత కుసుమాలు సురవరం
 ప్రతాపరెడ్డి, పద్మ విభూషణ్
 కాళోజీ, సాహిత్య అకాడమీ
 గ్రహీత దాశరథి, జ్ఞానపీఠ్
 అవార్డ్ గ్రహీత డా. సి. నారాయణరెడ్డి,
భారత దేశ తొమ్మిదవ ప్రధాని
 పి.వి. నరసింహారావు లాంటి
 మహామహులున్న బహుభాషా  కూటమిది....

బౌధ్ధ మత స్మారక కట్టడాలు
శివ , విష్ణు,హనుమంతుడు,
 గణపతి ఆలయాలకు ప్రసిద్ది...

చార్మినార్ అయినా గోల్కొండ
 అయినా చారిత్రాత్మక
 కట్టడాలకు పెట్టిన పేరిది...

నవ తెలంగాణా ఆవిర్భావం
భాయీ, భాయీ అనుకునే
ఆంధ్రా తెలంగాణా విభజన
చంద్ర శేఖరుని కలను సాకారం చేస్తూ 
జలనిధి కాళేశ్వర ప్రాజెక్ట్ కు
 ఊపిరి అంది ఎన్నో పంటలకు
ఆయువు పోసింది....

సరికొత్త  విన్నూత పధకాలకు 
నాంది పలికింది 
సరికొత్తగా ఆవిర్భవించిన 
కోటి రతనాల వీణ తెలంగాణా ఇది....!!