కార్తీక మాసం విశిష్టత(ఇష్టపది)డా.రామక కృష్ణమూర్త--బోయినపల్లి,సికింద్రాబాద్.
నదీస్నానాలతో నవతేజస్సులతో
దీపముల కాంతులు దీవెనల క్రతువులు

అభిషేకాల ఝరులు అర్చనల వెల్లువలు
తులసి కళ్యాణాలు తూగిన దేవరతో

సత్యదేవుని కథలు సత్కాలక్షేపం
ఉపభోజనాలతో  ఉపవాస నియమంతో

ఉమాపతి భజనతో ఉసిరి దానాలతో
కార్తీక మాసాన కాలమును గడిపెదరు.