ధరణి పువ్వై నవ్వింది:- అనురాధ మచ్చ

 ప్రపంచ దేశాల్ని ప్రళయములో ముంచి
పాడు కరోనా పరుగులు దీసి,
మన దేశం మొచ్చింది మనల మాయంజేయ
ప్రాణంబు లను బట్టి పదిలముగను
జాగ్రత్త గుండాలి జగతినంత,
యిటి లోనందరు  యిగురము తోనుండి
గడుపుడని ప్రభుత  కట్టుబెట్టె,
కరుణ లేని కరోన కాటు వేయుననియు
కాలు కదపకుండ కఠిన దీక్ష,
బూనియు గడిపిరి బుద్దిగ  జనులంత
తగ్గెను  కేసులు తప్పదనియు,
నాంక్షలు తొలగించ హాయిగ నందరు
బాటలు బట్టిరి బయట దిరుగ,
భూ మాత బిడ్డలు భూమిని త్రవ్వుట,
గుంటలు జేయుట గుండెకోత,
యెన్నియో భరియించె యెరుగదు కోపము
వైరస్సు జూచియు వ్యధ నొంది,
తప్పు తెలుసుకున్న తనయుల దరిజేరి
జాగ్రత్తలు దెలిపి జయము పలికె.
తేటగీతి
పుడమి తల్లిని పూజించ పోవుబాధ,
బతుకు గడుచును బాగుగ భవిత వెలుగు,
ముద్దు మాటలు  జెప్పెను ముదము నొంది,
ధరణి  పువ్వుయై  నవ్వెను దయను చూపి.

కామెంట్‌లు