*జడతత్త్వం!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.పేరుకున్న జడత్వం!
   పక్కకు పోయే మనస్తత్త్వం!
  విపత్తు విస్తరించించినవేళ!
  ఒక్కటి తప్ప మిగిలిన,
  దేవాలయాల మాటేమిటి!
  ఆదాయం రాబట్టడమేనా?
  అపాయం పోగొట్టడమా!
2.దేశమంతా పీఠాల నెలవు!
   పీఠాధిపతులు కొలువు!
  ఆనాటి వారిలా పాదయాత్ర
                     చేయరా?
  చేసారో,కరోనాధిపతులు!
  కాలేకున్నారో,స్వర్గాధిపతులే!
3.జీవులు మురికివాడల్లో!
   దేవుళ్ళు, వారి మద్దతుదార్లు,
   మంచి ముత్యాలవాడల్లో,
   మేలైన రతనాలనివాసాల్లో!
4.బాబాలకు కొదవే లేదు!
   ఎంతమంది సాధు జీవనం?
 వారి ట్రస్టులకు,
               I.T.Exemptions,
  వారికి అదేమిటో,
            V.I.P. Relations,
  సన్యాసం కన్న ఉపన్యాసం!
  నేడు వీరి సేవలు మరీచికలే!
5.130కోట్ల ప్రజల ఈ దేశం,
    కోట్లు కూడ బెట్టినవాళ్ళు,
    ఓట్లు గెలుచుకున్నవాళ్ళు,
    సూట్లేసికార్లలో తిరిగేవాళ్లు,
    బినామిగా,
     రాయించుకున్నారు,
     వారే సామాన్యుడి,
      *జాతకచక్రం* వ్రాస్తారు!