" పసి పిల్లలు ":--గద్వాల సోమన్న

పసి పిల్లలు గృహములో
దివిని పారిజాతాలు
అందరిని అలరించే
సుందర జలపాతాలు

చిన్నారుల హృదయాలు
భగవంతుని ఆలయాలు
దేదీప్యమానంగా
వెలిగేటి మణిదీపాలు

పసి పాపల నయనాలు
అరుణోదయ కిరణాలు
పాలలో కడిగిన శుద్ధ,
మేలి ముత్యాల సరాలు

పసి పిల్లలు సదనాన
విలువైన బహుమానాలు
ముచ్చట గొల్పే కొలను
కలువ రేకుల వదనాలు

కామెంట్‌లు