పిడుగుల వాన (బాల గేయము)--పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
ఉరుముల వాన కురియంగా 
మెరుపులు ఎన్నో మేరవంగా
పిడుగులు  పడును జాగ్రత్త
చెట్ల కింద అసలే ఉండొద్దు 

వేసవి కాలమందున కురిసే
అకాల వర్షాలెప్పుడైనా
ప్రమాదాలను తెస్తాయి
ఆపార నష్టం కలిగిస్తాయి

పశువుల నెన్నో చంపేటి
 మనుషులనే చంపేటి
ఆస్తులు దగ్ధము చేసేటి
పిడుగుల వానలు వద్దే వద్దు.