పాపాయి (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
అమ్మ ఒడిలో పాపాయి
జాబిల్లిని చూసుకుంటూ
జోల పాట వినుకుంటూ
చిట్టి పొట్టి మా పాపాయి

హాయిగా నిద్ర పోతుంది
నిద్రలో కిలకిల నవ్వుతూ
ముద్దులోలికే ఆ పాపాయి
అందరిని మురిపిస్తుందీ

పసిడి వన్నెల పాపాయి
చిట్టి పొట్టి పాదాలతో
చిన్న చిన్న అడుగులేస్తూ
ఘల్లు ఘల్లున వస్తుంటే

అమ్మ నాన్నల చప్పట్లతో
అవ్వ తాత మురిపాలతో
చిన్నారి పాపాయి సందడితో
ఆనంద నిలయం మా ఇల్లు