చాణక్యుడు,ఉపదేశం(ఇష్టపదులు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
1.పరాయి పాలకులను పారద్రోలు యుక్తిని
మేధతో రచించిన మేదిని రక్షించిన

మంత్రాంగమును నెరిపి మంత్రిగాను వెలిగిన
విప్రవరుడు తానుగ విజయములను కూర్చెను

రాజుతో గూడిన రవి యతడు నిక్కము
మాతృభూమి రక్షణ మాన పరిరక్షణము

ఏకసూత్రత నెరిగియు ఐకమత్యం పెంచి
ఆర్య చాణక్యమును ఆరాధ్యమతడేను


2.చేసిన ఉపకారం చేతల్లో కనబడు
తప్పు చేయకు నీవు తామస గుణాలతో

అపకారపు పనులను‌ ఆవేశమున చేసి
బాధలు తెచ్చుకోకు బాధ్యతను మరువకుము

మమకారపు మంత్రము మనిషికిని జీవితము
లోకం మారునుగా లోకులు చూపగాను

సహకారమే చాలు సాధ్యము సర్వము యగు
తెలుసుకొని‌ చేస్తేను తేగలవుగ మార్పును


కామెంట్‌లు