పద్యం : - బేజగాం శ్రీజ , గుర్రాలగొంది


 *సీసం*
ప్రకృతమ్మ వొడిలోన వనజీవరాసులు
సేదతీర్చుకొనును చెంతజేరి
అడవులన్నినరక నంతమై పోవును
విపరీత వ్యాధులుపెరిగిపోవు
చేయిచేయికలిపి చేదోడువాదోడు
అందరొక్కటియైన నాదుకొనుడి
చెట్లనుపెంచుతూ జీవజాలమునకు
రక్షణివ్వగలరు రయముగాను
*ఆటవెలది*
ముందు తరము కొరకు మొక్కలునాటుతు
చెట్లుపెంచవలెను క్షేమమెరిగి
అడవులన్నిపెంచ నడవిజంతువులకు
ఆసరగనుయుండు నవనిలోన