*దోచుకో!*:- డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1."దోచుకో!" అని,
   ఎవరిని పిలవనక్కర్లేదు,
   నిద్రలో వలువలు,
                  వలిచేయడం,
  మెలకువ లో నిలువుదోపిడీ,
  నేడు అతి సహజం!
  అన్నిదారుల్లో దోపిడీదార్లే!
  విద్య విచిత్రదోపిడీ,
  వైద్యం వైవిధ్యదోపిడీ!
 వేక్సిన్ కైనా తప్పని రాపిడి!
2.నాటకం-సినిమా!
    రిక్షా-ఆటోరిక్షా!
    టైలర్- రెడీ మేడ్!
    లేబర్-కాంట్రాక్టర్!
3.అన్నింటిలో *అమెజాన్!*
   అమ్మకం *ఆమె జాన్!*
   రియాలిటీ *రిలయన్స్!*
బిజినెస్ *రియల్ లయన్స్!*
4.అసలు దోపిడీ ఆధ్యాత్మికం,
   గుళ్ళు వసూళ్ళ కూడళ్ళు,
   బళ్ళు చదువు కొనుగోళ్ళు,
  కార్యాలయాల్లో మామూళ్ళు!
5.క్రీకెట్ ఆటలు!
   సినిమా టిక్కెట్లు!
   అధికారం మెట్లు!
   దోపిడి తప్పెట్లు!
   దారిద్ర్యం కర్మక్షేత్రం!
   దోపిడి కార్యసూత్రం!
6. అహంలేనివి తరువులు,
    మోసంరానివి పశువులు,
    ద్రోహం తలపెట్టనివి,
                        శునకాలు,
   దోపిడి చేయనివి,
                 పంచభూతాలు!