సృజన (బాల గేయము) :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
అమ్మ వెంట పోయెదం
చేయు పనులు చూసెదం
వద్దు వద్దన్నా చేసెదం
కొన్ని పనులనే నేర్చదం

ఇంటి లోన ఉండెదం
ఆటలెన్నొ ఆడెదం
పాటలెన్నొ పాడెదం
వెనుక వెనుక తిరుగెదం

స్నేహితులతొ కూడెదం

ట్లుగా విడిపోయెదం
గెలుపు కై పోరాడెదం
పోటీలతొ ఎదిగెదం

 సూక్తులెన్నొ చెప్పెద్దం
 పద్యాలనే పాడెదం
 సరదా కథలనే వినెదం
 ఉత్సాహాలు పొందెదం
కామెంట్‌లు