నిర్లక్ష్యంతో కునారిల్లిన బడులకు
శ్వాస,ఆశ పౌరులే.
చదువుకున్న సమాజం ముందుకు వస్తే
ప్రభుత్వ బడులు కళకళలాడుతాయి.
బడ్జెట్ నిధులు పెంచబడి
ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయాలి.
సమాజం బడుల అవసరాలను గుర్తెరిగి
తోడ్పాటుకై ఉద్యమించాలి.
కనీసవసతులు,తాగునీరు,
ఆధునిక విద్యాబోధన సౌకర్యాల కల్పన
భావిభారత పౌరులకు అవశ్యము.
విద్య నేర్చిన సమాజం
అభివృద్ధికి సంకేతం.
పర్యవేక్షణలు,సానుకూల దృక్పథాలు పెరిగి,
విద్యావ్యవస్థ బలపడాలి.
పక్కా భవనాలు,ఆటస్థలాలతో
ఆనంద నిలయాలుగా విద్యాలయాలు మార్పు సంతరించుకోవాలి.
ప్రభుత్వ బడుల బలోపేతానికి
కార్పోరేట్ వ్యవస్థ కూడా నడుం బిగించాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి