పద్యం : బెజగాం శ్రీజ , గుర్రాల గొంది


 *సీసం*
బియ్యముగోధుమ పిండియే వచ్చును
విసురుడురౌతులో వేసిరుబ్బ
కర్ర పట్టియుత్రిప్ప జర్రున పిండంత
చుట్టూర రాలును సూక్ష్మ ముగను
పిండిని కలిపియు పెద్దగారొట్టెలు
పొయ్యిపైననుకాల్చ పొంగు నవియు
తినుచుండకొలదిగ  తృప్తియే కలుగుగ
కడుపునిండతినిరి జడుపులేక
*ఆటవెలది*
ఈకరోనవలన నింట్లనే యుండిరి
వంటకములుజేస్తు వనితలంత
విలువగలసమయము వృథజేయకుండను
పనులజేసుకొనురు బ్రతుకుకొరకు