బలే బలే ఆటలు (బాలగేయం)-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
నిమ్మరసమే తాగాలి
ఉసిరికాయలే తినాలి 
నీళ్లను బాగా తాగాలి 
ఆటలు ఎన్నో ఆడాలి 

మట్టిలో ఆడితే మేలంటా 
ఇమ్యూనిటీయే పెరుగునటా
ఉదయ, సాయంత్రపు ఎండంటా
ఎంతో శక్తిని ఇచ్చే నంటా

సెల్లుతో తక్కు

వ గడపాలి
ప్రకృతి యందే తిరగాలి
మాటా ముచ్చట పెట్టాలి 
కొంతైనా సాయం చేయాలి

కమ్మని కథలు వినాలి
మంచి పాటలు పాడాలి
చక్కని పద్యాలు చెప్పాలి
నవ్వల వాన కురిపించాలి.