*తే.గీ*
*సింగిరెడ్డివంశంబున- శ్రేష్ఠుడతడు*
*యవనియందునవెలసెను- కవిగతాను*
*గేయములనెన్నొవ్రాసెను- పాయకతడు* *
కీర్తి మిన్నగా పొందినా -మూర్తినతడు*
*తే.గీ*
*కలములోననునుండెను- కవితతల్లి*
*పదమునందుననుండెను-ఫరిమళమ్ము*
*కూర్పులందుననుండెను- కోకిలమ్మ
సింగిరెడ్డినారాయణ -భంగిలేరు*
*తే.గీ*
*పుడమియన్మాజిపేటందు- పుట్టెనతడు*
*పట్నమునకునువెళ్ళియు-పరగనుండె*
*పాటలల్లిసినీమాకు-మేటిగాను*
*ఒలకబోసెనుమధురాలు-తళుకులెన్నొ*
*ఆ.వె*
*కావ్యచక్రవర్తి-ఘనుడుసినారాయె
భువనవిజయకీర్తి- కవితమూర్తి*
*రాష్ట్రపతియుచేత-శ్రేష్ఠకానుకపొంది*
*తెలుగుభాషలోన- వెలుగు నింపె*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి