శివకేశవ తత్వం(ఇష్టపది):-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
హరిహరులకు ప్రీతిని, హర్షమును కల్గించు
కార్తీకమాసమున కావుమన్న చాలును

కదలివచ్చురిరువురు కామితములు తీర్చును
భక్తజన వల్లభులు భవపాపహరిహరులు

ఇద్దరొక్కరేయగు ఇహపరములివ్వగను
తత్వములెల్లరకును తన్మయమొనరించును

పుణ్యసాధనమునకు పూజించవలయును
శివకేశవతత్వము శీలసంవర్థనము.