మీ భాష ఏది ?:- జగదీశ్ యామిజాల

 వీరిద్దరూ
మాట్లాడుకునేది
అధికార భాషా?
లేక
ప్రాచీన భాషా?
లేక 
మాతృభాష కాని
పరభాషా?
ఈ భాషలేవీ కావు
వారి మధ్య ఉన్నదల్లా
ప్రేమ భాష
నిష్కల్మష భాష
వారిద్దరికి మాత్రమే
తెలిసిన భాషల్లా
ప్రేమాభిమానాల భాష
కావడంవల్లే
వినసొంపుగా ఉంటుంది
హృదయానికి