రారా చదువుల సోపానమునకు:- జయంత్ నమిలకొండ
మనసున మొలచిన భావాలే
నీగలగల నడకల అందెలుగా
నీ కళలను మోసుక నినుజేర
ఓ కమ్మని కథలా దెలిపేనే
బతుకును తెలిపే పాఠమురా!
ఎదసరి మ్రోగగా ఈవేళ
స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం


రారా చదువుల
సోపానమునకు
పాఠాలే జత చేయ
తొలి ఆమని కోయిలలా! 
వినుమని పిలిచే మిమ్మేరా! 
తెలగాణ టీవి పాఠాలే
వినసొంపుగ విన పిలిచేరా! 
మనసే నిలిపి వినవేలరా! 
మదినే దలచి చదువేయరా
మమత రవళి పిలిచింది
కవిత భవిత పలికింది
కొవిడు కలత చెదిరింది
మనసు భయము వీడండి

సొంపైనా పాఠాలే----2
ఈవన్నెచిత్ర కల్పనా
గుణకారం లెక్కలే
చేయమన్నవే
భావా పద్యాల పూరింపులనే
మమ్మే చేయమన్నవిలే. 

ఏడో తరగతి నూతన
పదగతి
మాకే మది దెల్పేలే
ఇది మాతరగతి పాఠాలు
పగలు రేయివి సాధనలు. 

రారా చదువుల సోపానమునకు
పాఠాలే జతచేయ
రారా మనసే నిలిపే వినరా
హోంవర్కే చేయరా! 

లలిత లలిత పదబంధము
మదిని మధుర సుమగంధము
తెలిపె మృదు పదగానము
తెలుగు గీతముల పాఠము. 


మరందాల పద్యాలే
మృదంగాల నాదము
ప్రబంధాల కావ్యాలే
పరిచయాల పాఠాలు
విజ్ఞాన శాస్త్రము వినేవిగా
ఆంగ్లము అందంగ పలికేలా
హిందే మాకది చూపెను మార్గం
నూతన పదగతి తెలిపేను
ఇవి మాతరగతి పాఠాలు
మనసే పొంగగ వింటిమి మేము
సంబరపడి హాయిగా
టీవిపాఠాలె మొదలయ్యే
తెలివే బాగుగ పెంచేలా.
కామెంట్‌లు