ఎందుకెందుకు?:- సత్యవాణి

 చెట్లు మ్రోడులగును ఏలను?
చెట్లు ఆకురాల్చునందున
చెట్లు ఆకులేల రాల్చును?
చెట్లు చిగురు తొడుగుటందుకు
చెట్లు చిగురు తొడుగుటెందుకు?
చిగురు మొగ్గతొడుగుటందుకు
చిగురు మొగ్గ తొడుగుటెందుకు?
మొగ్గ పూవు యగుటనందుకు
మొగ్గ పూవు యగుట ఎందుకు?
పూవు పిందె యగుటనందుకు
పువు పిందె యగుటనెందుకు?
పిందె కాయ యగుటనందుకు
పిందె కాయయగుటనెందుకు?
కాయ ఫలమునగుట యందుకు
కాయ ఫలము నగుట ఎందుకు?
ఫలము విత్తు నగుటయందుకె
        
కామెంట్‌లు